Chandrababu Dance Video: చంద్రబాబు డ్యాన్స్ వీడియో ఇదిగో, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి నృత్యం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribals Day) సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు (Congratulate) తెలియజేశారు.రాబోయే రోజుల్లో గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని తెలియజేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Here's Video
Here's CM Tweet