'Pawan Kalyan is Cyclone': వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ ఓ తుఫాన్ అంటూ మోదీ ప్రశంసలు, ఏపీలో కూటమి భారీ విజయానికి పవనే కారణమని వెల్లడి
పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్ అని ఆకాశానికి ఎత్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు.
ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రదాని మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్ అని ఆకాశానికి ఎత్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని మోదీ అన్నారు.
పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయని.. అంతే త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శించారు. తమిళనాడులో కూటమికి సీట్లు రాకపోవచ్చు కానీ మున్ముందు ఏం జరగబోతుందో తెలుస్తుందన్నారు. కొత్తగా ఏర్పడబోయే టీడీపీ మంత్రివర్గం ఇదేనా? ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, స్పీకర్ గా ఆయనేనా..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)