YS Jagan: వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్
చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.
చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యాదీవెన, గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. లా అండ్‌ఆర్డర్ గాలికొదిలేశారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదు. పవన్ కల్యాణ్ ఓ సినిమా ఆర్టిస్ట్, చంద్రబాబు ఓ డ్రామా ఆర్టిస్ట్ అని జగన్ చెప్పారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)