YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్‌ లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ.. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు.

KVP (Credits: Twitter)

Vijayawada, July 3: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె  వైఎస్ షర్మిల (YS Sharmila) త్వరలోనే కాంగ్రెస్‌లో (Congress) చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandrarao) స్పందించారు. షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ నష్టపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now