YS Jagan Support Mirchi Farmers: వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడా ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. మిర్చి యార్డ్ వద్ద పోలీసు అధికారులు భద్రత కల్పించలేదు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా మిర్చి యార్డ్ వద్ద ఎక్కడా పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోను జగన్ మీడియా సమావేశంలో భద్రతపై చంద్రబాబను ప్రశ్నించారు.
Ys Jagan Support Mirchi Farmers:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)