Cyclone Mandous: దటీజ్ భూమన కరుణాకర్ రెడ్డి, భారీ వరదల్లో, మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే, వీడియో సోషల్ మీడియాలో వైరల్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక అధికారులు ఉన్నారు. మోకాలి లోతు నీళ్లల్లో ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద ముంపువాసులను పరామర్శించారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. సహాయ, పునరావాస శిబిరాలను సందర్శించారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)