MP Vijayasai Reddy: వీడియో ఇదిగో, మనం ఇంకో 3 సార్లు కలిస్తే ఇద్దర్నీ గే అంటే ఏం చేస్తావ్, జర్నలిస్టుకు కౌంటర్ విసిరిన విజయసాయి రెడ్డి

నాలుగుసార్లు కలిస్తే, ఇద్దరం గే అని వార్తలు సృష్టిస్తారు అంటూ చురకలు అంటించారు. ఈ అంశంపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని, పార్లమెంట్‌లోనూ ప్రైవేట్ బిల్లు పెడతానని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

MP Vijayasai Reddy (photo-Video Grab)

వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. తనపై కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో సోమవారం (జూలై 15) మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని.. ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. మదన్‌ మోహన్ అనే వ్యక్తి తనను రెండుసార్లు కలిశాడని.. స్కాలర్‌షిప్‌ కోసం వస్తే సాయం చేశానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘అధికారిణి శాంతితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నువ్వు నన్ను ఎన్నిసార్లు కలిశావు’ అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.. నాలుగుసార్లు కలిస్తే, ఇద్దరం గే అని వార్తలు సృష్టిస్తారు అంటూ చురకలు అంటించారు. ఈ అంశంపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని, పార్లమెంట్‌లోనూ ప్రైవేట్ బిల్లు పెడతానని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Here's Video



సంబంధిత వార్తలు

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్