YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా మండిపడిన జగన్

నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

YS Jagan Mohan Reddy (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి రాగలం.. నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.  విజయసాయి రెడ్డి కథను పక్క దారి పట్టించేందుకే ఈ ధర్నా, వైసీపీ నిరసనపై మండిపడిన టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వీడియో ఇదిగో..

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif