Nara Lokesh Yuva Galam: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి, స్పృహ తప్పి పడిపోయిన నందమూరి తారకరత్న, కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించిన అధికారులు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు.
నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు.తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయన్ను బెంగళూరు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు.
నారా లోకేష్ లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కొద్దిదూరం నడిచిన అనంతరం.. అక్కడ మసీదులో లోకేష్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తారకరత్న కూడా లోకేష్ వెంట మసీదులోకి వెళ్లారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)