Pavuluri Passes Away: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత

గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి (96) కన్నుమూశారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత రాత్రి 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Hyderabad, Jan 13: గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు (Homeo Specialist) డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి (96) (Pavuluri Krishna Choudary) కన్నుమూశారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత రాత్రి 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య సుందర రాజేశ్వరి 2010లో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు 18 ఏళ్ల వయసులో మృతి చెందారు.

వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలి, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 ఏర్పాట్లపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

రెండో కుమారుడు డాక్టర్ నరేంద్రనాథ్ అమెరికాలో వైద్యుడు. డాక్టర్ పావులూరి ఏకైక కుమార్తె హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆమె కుమార్తె డాక్టర్ అపర్ణ కూడా హోమియో వైద్యంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ పావులూరి పార్థివ దేహాన్ని నేడు అభిమానుల సందర్శనార్థం అమీర్‌పేటలోని ఆయన స్వగృహంలో ఉంచుతారు. కుమారుడు నరేంద్రనాథ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement