'Jai Jagan' Slogan in TPCC Meeting: వీడియోలు ఇవిగో, తెలంగాణ పీసీసీ సమావేశంలో జైజగన్ నినాదాలు, కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నోటి వెంట కూడా..
ప్రసంగం ముసిందని సంకేతం ఇస్తే… జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశారు. ఈ పదం విన్నంతనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఏదో పొరపాటుగా అలా అని ఉంటారులే అని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఇక ఇదే వేదికపై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జగన్' అని నినదించిన వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన ఇంచార్జీగా పదవీ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో మీనాక్షితో పాటుగా పలువురు కీలక నేతలు, మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పార్టీ నిర్మాణం, వ్యవస్థ కొనసాగుతున్న తీరుపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే… ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఇవ్వొచ్చంటూ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను కోరారు.
ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మైకు తీసుకున్న పార్టీ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏదో సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి నేతల నుంచే కాకుండా సామాన్య కార్యకర్తల నుంచి కూడా సలహాలు తెలుసుకుంటున్న పద్ధతి మంచిగుందని, దీనిని ఇలాగే కొనసాగించాలని పీసీసీ చీఫ్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తన ప్రసంగం ముసిందని సంకేతం ఇస్తే… జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశారు. ఈ పదం విన్నంతనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఏదో పొరపాటుగా అలా అని ఉంటారులే అని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఇక ఇదే వేదికపై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జగన్' అని నినదించిన వీడియో వైరల్ అవుతోంది.
'Jai Jagan' Slogan in TPCC Meeting
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)