Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, నారాయణపేట దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టిన బస్సు
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బస్సు కింద పడి మృతి చెందింది.
ఇక మరో ఘటనలో ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొట్టి మహిళ మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాల(Jagtial )జిల్లా కేంద్రంలోని కరీంనగర్ వెళ్లే రోడ్డు వద్ద చోటు చేసుకుంది. జగిత్యాలలోని బుడిగజం గాల కాలనీకి చెందిన తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తిరుపతమ్మను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Woman dies in road accident after being hit by RTC bus