Governor vs CS: ఢిల్లీ కన్నా రాజ్‌భవన్ దగ్గరగా ఉంది, సీఎస్‌పై పంచ్ డైలాగ్ పేల్చిన గవర్నర్ తమిళిసై,బిల్లుల పెండింగ్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీఎస్ శాంతి కుమారి
సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు
తెలంగాణలో మరోసారి గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం గా వాతావరణం వేడెక్కింది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారి.. గవర్నర్ ముందు.. 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయనీ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. 5 నెలలు గడిచినా బిల్లుల్ని గవర్నర్ ఆమోదించలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (CS) శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ కామెంట్స్ చేశారు. సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు.. ప్రోటోకాల్ లేదు. కనీసం ఆమె ఫోన్‌లో కూడా మాట్లాడలేదని సీరియస్ అయ్యారు. ఢిల్లీ కన్నా రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. ఈ ట్వీట్‌ని శాంతికుమారికి ట్యాగ్ చేశారు.
Here's Governor Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)