Allu Arjun House Attacked: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు

అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు

Stones pelted at Allu Arjun's house at Hyderabad(video grab)

హైదరాబాద్‌(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు.

ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలు మూడు రోజులలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఇంటిపై దాడి తర్వాత పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిన మామ చంద్రశేఖర్ రెడ్డి

Court Grants Bail to Six in ‘Pushpa 2’ Actor’s Hyderabad Residence Vandalism Case

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement