Telangana: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారి, అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచిన అధికారులు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Assistant Registrar of Cooperative Societies Caught in ACB Bribery Case (Photo/X/Sudakar udumula)

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆఫీసుకు వచ్చిన వారి దగ్గర నుండి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా శ్రీనివాసరాజుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.  హైడ్రా పేరుతో బెదిరింపులు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, హైడ్రా పేరుతో అవినీతి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

శ్రీనివాసరాజు నుంచి లంచం మొత్తాన్ని రికవరీ చేయగా, డబ్బును ఉంచిన అతని కారు డ్యాష్‌బోర్డ్‌పై నిర్వహించిన రసాయన పరీక్షలో లంచం ఉన్నట్లు నిర్దారించామని ఏసీబీ అధికారులు తేలిపారు. శ్రీనివాసరాజును అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరిచామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement