MLA Raja Singh On KTR: చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ, నన్ను అక్రమంగా జైలులో పెట్టారు..ఇప్పుడు అదే గతి కేటీఆర్‌కు పడుతోంది..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్
చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ అన్నారు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ అన్నారు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు...ఇప్పుడు మీకు కూడా అదే గతి పట్టబోతోంది అన్నారు.
జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు, వెచ్చని దుప్పటి, టవల్, కర్చీఫ్, సబ్బులు, చట్నీ తీసుకెళ్లండని సూచించిన రాజాసింగ్...స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అన్నారు.
ఫార్ములా - ఈ రేస్ కేసులో ఇవాళ ఈడీ విచాణరణకు హాజరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విచారణ కొనసాగుతుండగానే
ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసులోపేర్కొంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, BLN రెడ్డి లను విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)