BRS AtmeeyaSammelan Blast: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి, మరికొందరికి గాయాలు
బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నామ, ఎమ్మెల్యే రాములు వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నామ, ఎమ్మెల్యే రాములు వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడ్డాయి. అక్కడ మంట అంటుకోవడంతో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)