Case Registered On Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Case Registered On Harish Rao at Bachupally PS(X)

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish rao) పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్(Chakradhar Goud) అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు (Bachupally Police Station) ఫిర్యాదు చేశాడు.

చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌తో పాటు సంతోష్‌కుమార్, రాములు, వంశీలపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో ఎ-2గా హరీశ్ పేరును పోలీసులు చేర్చారు.

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్

గతంలో కూడా చక్రధర్ గౌడ్‌.. హరీశ్‌ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హరీశ్‌ రావుతో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 120(vr),386,409,రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో హరీశ్‌ రావుకు ముందస్తు బెయిల్ లభించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement