Telangana: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం, న్యాయశాఖకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు.

High Court of Telangana | (Photo-ANI)

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు. న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌ని హైకోర్టు రెండు సంవ‌త్స‌రాలుగా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జ‌డ్జిల సంఖ్య‌ను పెంచ‌టం ప‌ట్ల తెలంగాణ న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపుపై న్యాయశాఖకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు.

G Kishan Reddy Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)