KTR on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్‌తో మాకేమి సంబంధం, ధర్నాలు ఇక్కడ కాకుండా అక్కడే చేసుకోమని చెప్పానని తెలిపిన మంత్రి కేటీఆర్

చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్‌ తనకు ఫోన్‌ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు

Minister KTR (Photo-X)

చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్‌ తనకు ఫోన్‌ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు.. ఏపీలో చేసుకోండి అని కేటీఆర్‌ నిలదీశారు.

చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అంశం. చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ధర్నాలు, ర్యాలీలేంటీ?. ఇక్కడి ఉద్యోగులకు చెబుతున్నా.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దు. హైదరాబాద్‌ ఐటీ ఇండస్ట్రీని డిస్టర్బ్‌ చేయొద్దని చెబుతున్నాను. ఇక్కడి ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్‌ పాడు చేసుకోవద్దు. తెలంగాణకు ఏపీ రాజకీయాలు తెచ్చి అంటించొద్దు. ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారు. రాజకీయాల కంటే శాంతిభద్రతలే మాకు ముఖ్యమని చెప్పాం. ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.?’ అని కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Minister KTR (Photo-X)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement