Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు... ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు.
Hyderabad, Aug 20: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో (New Secretariat) మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం (Temple), చర్చి (Church), మసీదు (Mosque) నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. కాగా, ఇక్కడి ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)