Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.
Hyderabad, Aug 25: సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ (Secretariat) ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం (Temple), మసీదు (Mosque), చర్చి (Church)ని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. తుది మెరుగులు దిద్దే పనులు గురువారం సాయంత్రానికి పూర్తిచేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి టీఎస్ శ్రీదేవి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు. అటు.. సెక్రటేరియట్‌లోని మసీదును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం గురువారం సందర్శించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.