Newdelhi, Aug 25: చంద్రుడిపై (Moon) విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో (ISRO) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) (X)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్రో పంపించిన చంద్రయాన్-3 (Chandrayaan-3)లో ల్యాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ సమయంలో తీసిన వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 చంద్రుడిపై దిగుతుండగా రికార్డ్ వీడియో ఇది.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలై..
చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలైన వీడియో, దక్షిణ ధృవంపై అడుగు పెట్టేవరకు ఉంది. జాబిల్లిపై దిగడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ తీసిన వీడియో ఎలా ఉందో చూడండి అంటూ ఇస్రో పేర్కొంది. ఈ వీడియో 2 నిమిషాల 17 సెకన్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, చంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేసినందుకు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు