![](https://test1.latestly.com/uploads/images/2025/02/51-177.jpg?width=380&height=214)
Hyderabad, FEB 12: తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. సచివాలయంలో రెయిలింగ్ కూలిపడటం భయబ్రాంతులకు గురి చేసింది. ఒక పెద్ద శబ్దంతో కూలిపడటంతో ఒక్కసారిగా అధికారులు అంతా అప్రమత్తమయ్యారు. 6వ ఫ్లోర్ నుంచి ఈ సిమెంట్ దిమ్మెలు కిందపడ్డాయి. మంత్రులు, మెజార్టీ విజిటర్స్ సౌత్ ఎంట్రీ నుంచే సచివాలయం లోనికి వెళ్తారు. అదే ఎంట్రీ పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. భయబ్రాంతులకు గురయ్యారు.
అయితే, సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అదే, ఉదయం వేళ భారీగా జనం ఉంటారు. ఆ ఎంట్రీ నుంచే విజిటర్స్, వీఐపీలు, అధికారులు లోపలికి వెళ్తూ ఉంటారు. సాయంత్రం వేళ ఈ ఘటన జరిగింది. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెహికల్ ఒక్కసారిగా 6వ అంతస్తు నుంచి సిమెంట్ దిమ్మెలు పడటంతో భారీ శబ్దం వినిపించింది.
ఆ శబ్దం విని అంతా ఉలిక్కిపడ్డారు. లోపల, బయట ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెహికల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది.