Revanth Reddy Praja Darbar LIVE: కాసేపట్లో ప్రగతిభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం, మంత్రులు (లైవ్ వీడియోతో)
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి... అప్పుడే తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
Hyderabad, Dec 8: తెలంగాణ ముఖ్యమంత్రిగా (Telangana CM) నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)... దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ప్రజాదర్బార్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు లైవ్ వీడియోలో చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)