Madhuyashki Goud: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్, బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని మండిపాటు

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు.

Congress Leader Madhuyashki Goud sensational comments(X)

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud)సంచలన కామెంట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారు అన్నారు.

గతంలో బీఆర్ఎస్‌కు(BRS) అనుకూలంగా పనిచేసిన వారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ 

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు..అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం అని మండిపడ్డారు కేటీఆర్.

Congress Leader Madhuyashki Goud sensational comments

ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now