Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదు, ఇద్దరు మృతితో 1,685 చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 మందికి కరోనా, ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 247 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,878 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,685గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,241 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,870 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 మందికి కరోనా సోకింది.
తెలంగాణలో 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)