Corona Virus: తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు.. రెండు నెలల చిన్నారికీ కరోనా... వెంటి లేటర్ పై చికిత్స
తెలంగాణలో కరోనా భయాలు పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Hyderabad, Dec 23: తెలంగాణలో (Telangana) కరోనా భయాలు (Corona Fear) పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు రికవర్ అయ్యారు. తాజాగా నమోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఆ పాపకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)