Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు

ముఖ్యంగా వరంగల్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Warangal, Dec 31: ముగిసింది అనుకున్న కరోనా (Corona) మళ్లీ డేంజర్‌ బెల్స్‌ (Danger Bells) మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ (Warangal) లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో 9 మంది చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు నమోదుకావడం పెరుగుతోన్న తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 4వేలకు చేరువైంది. కోవిడ్ మరణాలు సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే కరోనా కారణంగా ఏడుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

Ration Cards E-KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31ని డెడ్‌ లైన్ గా ప్రకటించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)