Hyderabad, Dec 31: తెలంగాణలో (Telangana) రెండు నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ (Ration Cards E-KYC) ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల (Ration Cards) ఈ-కేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. 87.81 శాతం నమోదుతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17 శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు.
Attention ration card holders in #Telangana! Last date for e-KYC extendedhttps://t.co/A1hw6Vro61
— Telangana Today (@TelanganaToday) December 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)