Covid in Telangana: హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్, ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 315 కోవిడ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో తెలంగాణలో 494 మందికి కరోనా
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు మాసాల తర్వాత మొదటిసారి కోవిడ్ కేసులు ఐదు వందలకు చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజున 494 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు మాసాల తర్వాత మొదటిసారి కోవిడ్ కేసులు ఐదు వందలకు చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజున 494 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలని వైద్యశాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.
గురువారం సాయంత్రానికి హైదరాబాద్ నగరంలో 315 కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నాలుగు రోజుల కేసులను పరిశీలిస్తే ఈనెల 19వ తేదీన 180 నమోదు కాగా, 20న 185, 21వ తేదీన 240 కేసులు, 22వ తేదీన 292 కేసులు నమోదయ్యాయి.గత కొంతకాలం క్రితం అత్యల్పంగా 9 కేసులు మాత్రమే నమోదు అయినా తాజాగా కేసులు సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)