Cyber Alert: రైతు సోదరులకు హెచ్చరిక.. రుణమాఫీ పేరుతో మెసేజ్ లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ.. సైబర్ నేరగాళ్ల బురిడీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు.
Hyderabad, July 19: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ (loan waived off) పేరుతో అమాయకపు రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఫోన్ కు లింక్ పంపి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటూనే మీరు రుణమాఫీకి అర్హులవుతారు అంటూ మెసేజుల్లో, వాట్సప్ లో లింకులు పంపుతున్నారు. అలంటి లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి క్లిక్ చేస్తే, ఖాతాల్లోని సొమ్ము తస్కరించే ప్రమాదం ఉన్నదని, ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)