Earthquake in Medaram: వీడియో ఇదిగో, భూంకంపం దెబ్బకు వణికిపోయిన మేడారం సమ్మక్క-సారక్క గద్దెలు, గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగినట్లు సీసీకెమెరాల ద్వారా స్పష్టం
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మక్క-సారక్క గద్దెలు వణికిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మక్క-సారక్క గద్దెలు వణికిపోయాయి. సారక్క గద్దె వద్ద ఉన్న కెమెరాకు .. భూ ప్రకంపనలు చిక్కాయి. భూమి ప్రకంపించిన సమయంలో గద్దె వద్ద ముగ్గురు ఉన్నారు. ఓ వ్యక్తి గద్దె వద్ద కూర్చుని పూజ చేస్తుండగా, మరో వ్యక్తి అతని సమీపంలో నిలబడ్డారు. ఓ మహిళ కూడా ఆ గద్దె వద్దే ఉన్నది.గద్దెలపై ఉన్న ఇనుప గ్రిల్స్ కూడా ఉగిపోయాయి. గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగినట్లు సీసీకెమెరాల ద్వారా స్పష్టమైంది. కెమెరాలు వణికిపోవడంతో.. అక్కడ భూమి కంపించినట్లు అర్థమైంది.
Earthquake in Medaram:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)