MLC Bye-Election in Telangana: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి

Election Commission of India. (Photo Credit: Twitter)

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

►జనవరి 11న నోటిఫికేషన్‌

►నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18

►జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ

►నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22

►జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌, కౌంటింగ్‌

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement