Etela Rajender: హుజురాబాద్‌ గెలుపు కోసం టీఆర్ఎస్ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టింది, ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్‌

ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు.

Etela Rajender Take Oath (Photo-Twitter)

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్‌ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అ‍న్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టిందని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)