Fire Accident in Nalgonda: నల్గొండ శ్రీపతి ల్యాబ్ లో లీకైన రియాక్టర్.. చెలరేగుతున్న మంటలు ( వీడియో)
మొన్నటికిమొన్న ఏపీలోని అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనను మరిచిపోకముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లో మంటలు చెలరేగాయి.
Nalgonda, Aug 30: పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు (Fire Accident) ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొన్నటికిమొన్న ఏపీలోని (AP) అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనను మరిచిపోకముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లో మంటలు చెలరేగాయి. దీంతో నల్లని దట్టమైన పొగ కమ్ముకున్నది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)