Fire Accident: వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన బ్యాగుల దుకాణం

హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Fire accident (Credits: X)

Hyderabad, Oct 16: హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్‌ మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now