Hyderabad: సంతలో మోమోస్‌ తిని మహిళ మృతి, మరో 20 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత, కొందరి పరిస్థితి విషమం, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్‌ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు.

Food poisoning after eating momos.. One woman died, more than 20 people fell ill

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్‌ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో బంజారాహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

నెల రోజులపాటు హైదరాబాద్‌ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??

మోమోస్‌ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నారు. రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతిచెందారు. ఈ సంఘటనపై ఇప్పటికే బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్‌తో పాటు ఇచ్చే మయోనైజ్‌, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement