Hyderabad, Oct 28: హైదరాబాద్ (Hyderabad) నగరంలో 144 సెక్షన్ (ప్రస్తుతం సెక్షన్ 163) (144 Section In Hyderabad) విధించారు. ఆదివారం (27వ తేదీ) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్ లో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం జరుగకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపారు. బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
Hyderabad Commissioner of Police imposes Section 144 in Hyderabad Police limits for 1 month beginning 27th October 2024.
It is stated that several organisations/ parties are trying to create disturbances affecting public peace and order in Hyderabad city by resorting to dharna… pic.twitter.com/zMf0nJePa5
— ANI (@ANI) October 27, 2024
అక్కడ మాత్రమే వెసులుబాటు
నగరంలో అంతటా 144 సెక్షన్ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రం వెసులుబాటు ఉంటుందని అక్కడ శాంతియుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పోలీసుశాఖ పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అంతటా నిరసన ప్రదర్శనలను నిషేధించినట్టు తెలిపింది. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాలు కలుగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నగరంలో శాంతి-భద్రతలు కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.