Hyderabad: దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, వారిని శాలువాతో సత్కరించిన బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని పైగా కాలనీ ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను తల్లి కూతురు తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరి వీరోచిత పోరాటాన్ని అభినందించేందుకు ఈటెల రాజేందర్ అభినందించారు.
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని పైగా కాలనీ ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను తల్లి కూతురు తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరి వీరోచిత పోరాటాన్ని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని తమ ఇంట్లో తుపాకీతో చోరీకి ప్రయత్నించి విఫలమైన దొంగలను తరిమికొట్టిన ధైర్యవంతులైన తల్లీకూతుళ్లను మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు. ఇక శుక్రవారం నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వారిని ప్రశంసలతో ముంచెత్తారు. సదరు మహిళ ఇంటికి చేరుకున్న డీసీపీ తల్లి కూతురుని శాలువాతో సత్కరించారు. వీరి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్
Here's Video