Telugu States Floods:  తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.

Former Vice President Venkaiah Naidu

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఆయన కుమారుడు, కూతురు కూడా రెండు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీకి తాను ఫోన్ చేశానని... రెండు రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని కోరానని తెలిపారు. ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని మోదీ తనకు చెప్పారని అన్నారు. ఇరు రాష్ట్రాలకు సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement