Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

Formula-E Race case.. ACB notices to KTR(X)

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో  కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

కేటీఆర్ ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరు కావాలని భావించారు. అయితే ఏసీబీ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. ఒక్కర���నే విచారిస్తామని, న్యాయవాదిని అనుమతించేది లేదని చెప్పారు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లారు. దీంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

KTR Gets Another Notice From ACB

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement