Missing Students Safe: అంబర్‌పేటలో తప్పిపోయిన విద్యార్థులు సేఫ్.. యాదగిరిగుట్ట మండలం బావి వద్ద స్నానం చేస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
హైదరాబాద్ అంబర్‌పేటలో మిస్ అయిన నలుగురు విద్యార్థులు సేఫ్‌గా దొరికారు(Missing Students Safe). నిన్న హైదరాబాద్ అంబర్ పేట్ లో (Amberpet)తప్పిపోయారు నలుగురు విద్యార్థులు.
హైదరాబాద్ అంబర్‌పేటలో మిస్ అయిన నలుగురు విద్యార్థులు సేఫ్‌గా దొరికారు(Missing Students Safe). నిన్న హైదరాబాద్ అంబర్ పేట్ లో (Amberpet)తప్పిపోయారు నలుగురు విద్యార్థులు.ఈరోజు యాదగిరిగుట్ట మండలం(yadagirigutta) దాతర్ పల్లి వ్యవసాయ బావి వద్ద స్నానం చేస్తుండగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.
పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. వీరంతా ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.
పరీక్షలో కాపీ కొడుతుండటంతో వీరిని టీచర్ మందలించి తల్లిదండ్రులకు చెబుతానని తెలపగా భయంతో ఇంటి నుండి బయటకు వచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ని గుర్తించారు పోలీసులు.
Four Missing Students in Hyderabad's Amberpet Found Safe
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)