Gunmen Withdrawn By Revanth Government: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్ మెన్ల తొలగింపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్ మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది.
Hyderabad, Dec 15: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు (Former Ministers), ఎమ్మెల్యేల (Former MLAs) గన్ మెన్లను (Gunmens) తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉన్న గన్ మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఎవరెవరికి గన్ మెన్లు అవసరమనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. ఆ నివేదిక మేరకు గన్ మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీలపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)