Hath Se Hath Jodo: వీడియో, అరక దున్నలేక ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డి, వ్యవసాయం అంటే ఎంత కష్టమో తెలిసిందంటూ ట్వీట్, రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నానని వెల్లడి

దాంతో రేవంత్ అరక దున్నలేక ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి వీడియో సహా ట్విట్టర్ లో పంచుకున్నారు. వ్యవసాయం అంటే ఎంత కష్టమో అని పేర్కొన్నారు

Revanth Reddy Interaction With Farmers (Photo-Video Grab)

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ సందర్భంగా  పొలంలో అరక దున్నుతున్న రైతు వద్దకు వెళ్లి, సేద్యం తీరుతెన్నులు పరిశీలించారు. ఆ తర్వాత తాను అరక దున్నే ప్రయత్నం చేశారు. అయితే, జనాలను చూసి బెదిరిన ఆ ఎద్దులను నియంత్రించలేక రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడ్డారు.

నాగలి కర్రును రేవంత్ గట్టిగా భూమిలోకి అదిమి పట్టుకోలేకపోవడంతో ఆ ఎద్దులు ఇష్టారాజ్యంగా పరుగులు తీశాయి. దాంతో రేవంత్ అరక దున్నలేక ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి వీడియో సహా ట్విట్టర్ లో పంచుకున్నారు. వ్యవసాయం అంటే ఎంత కష్టమో అని పేర్కొన్నారు. రైతుల శ్రమ అంతాఇంతా కాదని పేర్కొన్నారు. మనమేమో హాయిగా ఇళ్ల వద్ద కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తుంటామని తెలిపారు. రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నానని రేవంత్ వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు