Security Guard Stuck in Lift: లిఫ్టులో చిక్కుకుని విలవిలలాడిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు, రెండు కాళ్లు బయట బాడీ లోపల..

HDFC Bank security guard trapped in lift in Kotagalli shopping complex (photo-Video Grab)

కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు మహేందర్ గౌడ్ ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో విలవిలలాడాడు. కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో HDFC హౌసింగ్ లోన్ బ్యాంక్ లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్ రూముకు లిఫ్ట్ లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో కాళ్లు బయట పెడుతున్న క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు. సుమారు గంట పాటు అరుపులు కేకలు పెట్టాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement