Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఇతర జిల్లాలకూ వర్షసూచన
కొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad, Aug 12: కొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ (Hyderabad) పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) పడుతుంది. ఇక తెలంగాణలోని (Telangana) పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తాయంది. నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, హనుమకొండ, కామారెడ్డి, వరంగల్, సూర్యపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు నేడు ఏపీలో మోస్తారు వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)