Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, ఆల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరింది.
మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకీయా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి.పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Here's Videos