Drug Bust in Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్టు, పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, వీడియో ఇదిగో..
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది.రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది.
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది.రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. నకిలీ టాబ్లెట్ల రాకెట్ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, రూ.7.34 లక్షల విలువైన నకీల మందులు స్వాధీనం,వీడియోలు ఇవిగో..
గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రూ. 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా డ్రగ్స్ ముఠా నిందితుల నుంచి రెండు పాస్‌పోర్టులు, 10 మొబైల్స్, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)