Hyderabad Fire Accident: శివపార్వతి థియేటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం, పూర్తిగా తగలబడిపోయిన థియేటర్, దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది
కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు (Hyderabad Fire Accident) వ్యాపించాయి. దీంతో థియేటర్ పూర్తిగా (fire broke out At Shiva Parvathi Theatre) తగలబడిపోయింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు
కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు (Hyderabad Fire Accident) వ్యాపించాయి. దీంతో థియేటర్ పూర్తిగా (fire broke out At Shiva Parvathi Theatre) తగలబడిపోయింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్‌ల సహయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతం థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమా నడుస్తుంది. మంటల ధాటికి థియేటర్ స్ర్కీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)